calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా రన్ ఫర్ జీసస్

19-04-2025 08:38:13 PM

మందమర్రి (విజయక్రాంతి): మరణాన్ని జయించిన క్రీస్తును ప్రకటిద్దాం అంటూ క్రైస్తవ సోదరులు  నిర్వహించిన రన్ ఫర్ జీసస్ (యేసు కోసం పరుగు) ఉత్సాహంగాసాగింది. పట్టణంలో సియస్ఐ చర్చి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ లో క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దొర్ల బంగ్లా ఏరియా నుండి ప్రారంభమైన ర్యాలీ సియస్ఐ చర్చి వద్ద ముగించారు.

షాలోమ్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాస్టర్ ఏలీయా జెండా రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సియస్ఐ చర్చి పాస్టర్ రెవ.బంటు జేర్మీయా మాట్లాడుతూ... యేసు క్రీస్తు మరణం,3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచిన సందర్భంగా ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు. యేసు ప్రభువు ప్రేమ, కరుణ, త్యాగం గురించి పట్టణ పురవీధులలో వివరిస్తున్నామన్నారు.యువతి,యువకులు ఉత్సాహంగా పాల్గొని ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యేసు కోసం పరుగెడదాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఆనంద్, జూపాక సోల్మొన్, ముల్కల జాన్ ప్రసాద్, సంతపురి సునిల్, బత్తుల కిషోర్, కొండ రాజరత్నం, నక్క కమల్ బాబు లు పాల్గొన్నారు.