calender_icon.png 19 April, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యతను కాపాడే బాధ్యత మనది

19-04-2025 06:05:23 PM

ఘనంగా రన్ ఫర్ జీసస్..

ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎనోష్ కుమార్..

కల్లూరు (విజయక్రాంతి): మతసామరస్యతను కాపాడాలని దేశ పౌరులుగా అట్టి బాధ్యత మన మీద ఉన్నదని ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రెవ ఎనోష్ కుమార్(AICC State President Rev. Enosh Kumar) అన్నారు. మండల కేంద్రంలో అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమంను అత్యంత ఘనముగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ చెడు మార్గంలో నడవకుండా ఏసుక్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలని అన్నారు. క్రైస్తవ ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు క్రీస్తు యొక్క సిలువ మరణ పునార్ధానములను ప్రకటిస్తూ యేసు కొరకు పరిగెత్తుట రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

ఏసు క్రీస్తు ప్రభువు మరణం  ద్వారా సర్వ మానవాళికి పాప క్షమాపణ కలిగిందని అన్నారు. ఏసుక్రీస్తు ప్రభువు వారు నేర్పించిన బోధ ప్రేమ,శాంతి, సమాధానము దేశంలో నెలకొల్పబడాలని అందుకు క్రైస్తవులందరూ ప్రార్థించాలని తెలియజేశారు. రాష్ట్రంలలో పలుచోట్ల క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని క్రైస్తవులు ఐక్యంగా ఉంటూ జరుగుతున్న దాడులను అందరు ముక్తకంఠంగా ఖండించాలని తెలిపారు. క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నా క్రైస్తవులపై ఎందుకు దాడులు చేస్తున్నారో అర్థం కావట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవ సమాజం అంతా దేశము, రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థించాలని కోరారు.

అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఎన్ఎస్పి క్రాస్ రోడ్ నుండి కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. ఏఐసిసి మండల అధ్యక్షులు తెళ్ల ఎబినేజర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఎనోష్ కుమార్ తో కలిసి ప్రేయర్ సెల్ జిల్లా అధ్యక్షులు టి నిర్మల్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమం అధ్యంతం క్రైస్తవ మత పెద్దల ప్రార్థనలతో అత్యంత భక్తిశ్రద్ధలతో క్రీస్తు కొరకు పరిగెత్తారు. ఈ కార్యక్రమంలో aicc జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్నాసి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు,మండల అధ్యక్షులు టి.ఎబినేజర్,ఫాదర్ సురేష్, రెవ భాస్కర్, గౌరవ అధ్యక్షులు టి.సంజీవరావు, ఉపాధ్యక్షులు పి. దయాకర్, కార్యదర్శి ఎం.జాన్ పరంజ్యోతి, కె.మహేష్, సమర్పన్ పాల్, రాజశేఖర్, సుందర్ రాజు, ఫ్యాట్ అధ్యక్షులు జయరాజు, నియోజకవర్గ కన్వీనర్ కేనడిరాజ్, అయామండలలా అధ్యక్షులు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.