calender_icon.png 19 April, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణంలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ

19-04-2025 07:49:02 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలను పురస్కరించుకొని క్రైస్తవులు శనివారం పట్టణంలో రన్ ఫర్ జీసస్(Run for Jesus) శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ చౌక్ నుండి ప్రారంభమై సూపర్ బజార్, రామాలయం చౌరస్తా ప్రధాన కూడలిల మీదగా ఆంద్రాబ్యాంక్ ఏరియా సిఎస్ఐ చర్చి వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో క్రైస్తవ యువతీ యువకులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చి ఫాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా మాట్లాడుతూ ఏసుక్రీస్తు మానవాళి రక్షణ కోసం ఈ లోకంలో జన్మించారనీ, అందరినీ సమానంగా చూడాలని, ప్రేమ,కరుణ భావాలతో మెలగాలని సూచించారు. ర్యాలీలో పాల్గొన్న క్రైస్తవ సోదరులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ సెక్రటరీ డోలకల డేవిడ్,చర్చి ఫాస్ట్రేట్ స్టూవర్టు కే.దేవానందం తదితరులు పాల్గొన్నారు.