19-04-2025 02:59:44 PM
మంథనిలో (ఎంసీపీఎఫ్) ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ లో అధ్యక్షులు ఐతు ఎలీషా
మంథని,(విజయక్రాంతి): లోక రక్షకుడైన ఏసుక్రీస్తు మరణ పునరుత్థానమునని, ఆయన ప్రేమను చాటి చెబుతూ మంథని పట్టణంలో (ఎంసీపీఎఫ్) ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఎఫ్ అధ్యక్షులు ఐతు ఎలీషా, అధ్యక్షులు ఐతు డేవిడ్, ఉపాధ్యక్షులు దైవ కృపాకర్, కార్యదర్శి అశోక్, కోశాధికారి జయరాజ్, కమిటీ సభ్యులు నవీన్, సుదర్శన్, జోసెఫ్, రాజ్ కుమార్ , జాన్ వెస్లీ, మంథని, రామగిరి, ముత్తారం కమాన్ పూర్ పాస్టర్స్ అధిక సంఖ్యలో విశ్వాసులు పాలు పొంది కార్యక్రమమును విజయవంతం చేశారు.