వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలి
హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్...
హుజురాబాద్ (విజయక్రాంతి): ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని హుజురాబాద్ లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి రంబుల్ ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నామని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో మంగళవారం జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని సైదాపూర్ మూలమలుపు వద్ద రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా నడపాలని, ముఖ్యంగా మత్తుపదార్థాలు, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదల సంఖ్య తగ్గించవచ్చని అన్నారు. ద్విచక్రవాహనాలు నడిపే వారు విధిగా హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు సీటు బెల్టు వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, వెహికిల్స్ సీజ్ చేయడంతో పాటు వారి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు తిరుమల గౌడ్, ఎస్ఐ యూనిస్ అహ్మద్ఆలీ పాల్గోన్నారు.