calender_icon.png 24 January, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలకనందలో నిబంధనలకు పాతర

24-01-2025 01:33:23 AM

  1. విచారణ కమిటీ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
  2. ఎలాంటి అనుమతులు లేకుండా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పేరుతో వైద్యం
  3. లాభాలకు రుచిమరిగి కిడ్నీ మార్పిడి వ్యాపారం
  4. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్న అధికారులు, పోలీసులు

ఎల్బీనగర్, జనవరి 23: సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ వ్యాపారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన సర్కార్ ఇప్పటికే విచారణ కమిటీని కూడా నియమించింది. విచారణ కమిటీ సభ్యులు బుధవారం అలకనంద ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టడంతో పాటు  వైద్యులు, సిబ్బందిని విచారించారు.   

ఈ క్రమంలో అలకనంద ఆస్పత్రికి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు వెలుగు  ఎల్బీనగర్‌లోని డాక్టర్స్ కాలనీలో మొదటగా ఇద్దరు డాక్టర్ల ఆధ్వర్యంలో 9 పడకలతో నాలుగు అంతస్తుల భవనంలో అలకనంద ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కొన్నిరోజుల తర్వాత 30 పడకల దవాఖానాగా విస్తరించడంతో పాటు మల్టీస్పెషాలిటీ దవాఖానగా పేరు మార్చారు.

అయితే సదరు ఆస్పత్రి యాజమాన్యం మల్టీస్పెషాలిటీ దవాఖానకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం. ఇంత నడుస్తున్నా వైద్యాధికారులు దవాఖానపై నిఘా పెట్టలేదు. దీనిని ఆసరగా తీసుకున్న నిర్వాహకులు అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను పిలిపించి, శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.

గంటల లెక్కలో వైద్యులను పిలిపించి, రోగులకు శస్త్ర చికిత్స చేయించి, మిగతా వైద్యాన్ని నర్సులు, ఇతర సిబ్బందితో చేయిస్తున్నారు. లాభాలు వస్తుండటంతో నిర్వాహకులు కిడ్నీ దందాకు తెరలేపారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి పేదవారిని లక్ష్యంగా చేసుకుని కిడ్నీ మార్పిడులకు పాల్పడుతున్నారు.

మూడు రోజుల క్రితం వెలుగుచూసిన రూ.55 లక్షలకు కుదుర్చుకున్న కిడ్నీ వ్యాపారం లెక్కల్లో తేడా రావడంతో అక్కడి సిబ్బంది వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వైద్యాధికారులు తనిఖీ చేపట్టగా కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. విచారణ కమిటీ సభ్యులు దవాఖానలో చేపట్టిన తనిఖీల్లో సదరు దవాఖాన నిర్వాహ  నిబంధనలకు పూర్తిగా పాతరేసినట్లు తెలిసింది.

విచారణ కొనసాగుతోంది. అలకనంద మేనేజ్‌మెంట్‌కు చెందిన సుమంత్ అనే వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. అతడు చెప్పే నిజాలు కేసులో కీలకం కానున్నాయి. త్వరలో దర్యాప్తు పూర్తి చేసి వివరాలు వెల్లడిస్తామని సరూర్‌నగర్ పోలీసులు తెలిపారు.