calender_icon.png 1 January, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సంవత్సరం వేడుకల్లో నిబంధనలు పాటించాలి

29-12-2024 07:36:30 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకలను ప్రతి ఒక్కరు కూడా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలు(New Year celebrations) పురస్కరించుకొని పోలీస్ శాఖ విధించిన నిబంధనల మేరకు జరుపుకోవాలన్నారు. ఎక్కువ మధ్యాన్ని సేవించవద్దని అర్ధరాత్రి 12 గంటల తర్వాత సంబరాలు జరుపుకోవద్దని కోరారు. మైనర్ పిల్లలకు మోటర్ సైకిల్ ఇవ్వద్దని, మైనర్ పిల్లలు మోటార్ సైకిల్ నడిపితే కేసులు పెడతామన్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసుల తనిఖీ ఉంటుందని నిబ్బందులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కోన్నారు.