- నిబంధనలు పట్టవంటున్న మీసేవా నిర్వాహకులు
- అసలు ధరల కంటే రెట్టింపు వసూళ్లు
- అనుమతులు ఒక చోట, నిర్వహించేది మరో చోట
సూర్యాపేట, జనవరి 29 (విజయక్రాంతి): ప్రభుత్వం అన్ని రకాల సేవలను ఒకే దగ్గర అందిచడంతో పాటు అవినీతిని అరికట్టాలని, ప్రజలు ప్రభుత్వ కార్యాల యాల చుట్టూ తిరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మీ సేవ కేంద్రాలను అందు బాటులోకి తీసుకవచ్చింది.
ప్రజలకు ప్రభుత్వ సర్వీసులను పారదర్శకంగా అందిచేందుకు ఏర్పాటు చేసిన ఈ మీసేవ కేంద్రాలు అవినీతి, అక్రమాలకు నిలయంగా మారా యనే అరోపణలు వస్తున్నాయి. నిబంధన లు అతిక్రమించి అధిక వసూళ్లకు పాల్పడ టమే కాకుండా... అనుమతులు తీసుకున్న చోట కేంద్రాలను నిర్వహించకుండా మరో చోట నిర్వహిస్తున్న అధికారులు పట్టించు కోవడం లేదు.
అసలు ధర కంటే రెట్టింపు వసూళ్లు...
మీ కేంద్రాల్లో ప్రభుత్వ నిర్దేశించిన ధర కంటే రెట్టింపు నగదును బహిరంగానే ఏలాంటి జంకు లేకుండా వసూలు చేస్తు న్నారనేది బహిరంగ రహస్యమే. సూర్యాపే ట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ సమీపంలో ఉన్న ఓ మీసేవ కేంద్రమే ఇందుకు ఉదహరణ.
సాధారణం గా ఆదాయ, కుల, నివాస, కుటుంబ స భ్యుల దృవపత్రాలతో పాటు ఈ డబ్ల్యూస్, ఓబీసీ, జనన, మరణ దృవపత్రాలకు ప్రభుత్వ నిబంధన ప్రకారం రూ.45 రుసుము తీసుకోవాలి, కాని ఈ మీసేవ కేంద్రంలో రూ. 100 నుంచి రూ.150కి పైగానే వసూలు చేస్తున్నారని పలువురు బాదితులు అంటు న్నారు.
ఈ ఒక్క మీసేవ కేంద్రంలోనే కాకుండా జిల్లా కేంద్రంతో పాటు, అన్ని మున్సిపాలీటీలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మీసేవలోనే ఇదే తరహా దోపిడి జరుగు తున్నది. పేరుకే మీసేవ రుసుముల పట్టిక అని బోర్డు పెడుతున్నారు. కాని ఒక్కరు కూడా పాటించడం లేదని అంటున్నారు.
అంతే కాకుండా మీసేవ కేంద్రాల ఏర్పాటకు ప్రభుత్వం విధించిన నిబంధనలకు నిర్వాహకులు పాతర వేశారు. సూర్యా పేట జిల్లా కేంద్రంలో ప్రస్తుతం నడుస్తున్న మీ సేవ, టీఎస్ ఆన్లున్ కేంద్రాల లో ఎక్కువ కేంద్రాలు అనుమతు తీసుకున్న ప్రాంతాల లో నడవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు తీసుకున్న కేంద్రాలు పట్టణంలో నిర్వహిస్తున్నారు.
ఇందులో కొందరు మీ సేవ నిర్వహకులు ప్రస్తుతం కేంద్రాలు నిర్వహిస్తున్న లోకేషన్‌కు అక్రమమార్గంలో తమ అనుమతులను మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఒక సెంటర్ లో సుమారు 500 మీటర్ల దూరంలో 5 మీసేవలు నడు స్తున్నాయి. అయినా అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవ హరిస్తున్నారని పలువురు ఆరోపించారు.
అధికారుల చేతి వాటం..
మీ సేవ కేంద్రాల నిర్వహకులు అన్ని రకాల సర్వీసులకు బహిరంగానే అధిక రుసుము చేస్తున్నారు. అయితే మీ సేవ సర్వీసులు, వాటి పనితీరుపై సంబం ధిత శాఖ అధికారులు నిరంతరం పర్యవే క్షించ వలసి ఉన్నా.. పిర్యాదులు అందితేనే చర్య లు తీసుకుంటామన్న రీతిలో వ్యవహ రిస్తున్నారు.
మీసేవ నుంచి అధికా రులకు అక్రమ వసూళ్ల నుంచి వాటా అందుడనే ఆరోపణులు ఉన్నాయి. అంతే కాకుండా పిర్యాదులు అందాయని మీసేవ తనిఖీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడు తున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. మీ సేవల పనితీ రును పర్యవేక్షించే అధికారి కొన్ని నెలలు గా ఎక్కడ నుంచి విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది.