calender_icon.png 15 January, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాశ్వత నివాసానికి నిబంధనలు కఠినతరం

19-12-2024 01:28:26 AM

* కెనడా కీలక నిర్ణయం

ఒట్టావా, డిసెంబర్ 18: కెనడాలో శాశ్వత నివాసానికి సంబంధించిన నిబంధనలను అక్కడి ప్రభుత్వం కఠినతరం చేసేందుకు సిద్ధమవుతున్నది. ఉద్యోగాల పేరుతో శాశ్వత, తాత్కాలిక నివాసం పేరుతో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేసేందుకు ప్రత్యే క ప్రణాళిక అమలు చేయనున్నది. సాధారణంగా కెనడాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీలు ఒక విదేశీ వ్యక్తిని తమ కంపెనీలో రిక్రూట్ చేసుకోవాలనుకుంటే లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసోషియేషన్ (ఎల్‌ఎంఐఏ)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. అలా కంపెనీ ద్వారా ఉద్యో గం పొందిన వ్యక్తి అక్కడ శాశ్వత నివాసం కోరుకుంటే అది అదనపు ప్రయోజనమవుతుంది. శాశ్వత నివా సం కోసం ఎంతోమంది విదేశీ ఉద్యోగులు మోసాలకు పాల్పడుతున్నారు. మోసాలను నిర్మూలించేందు కు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కెనడా మంత్రి మార్క్ మిల్లర్ ఇటీవల ప్రకటించారు. జాబ్ ఆఫర్ ద్వారా శాశ్వత నివాసం పొందే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు.