కేంద్రం స్పందన కోరిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, నవంబర్ 12: మద్యం విక్రయ కేంద్రాల వద్ద వయసు తనిఖీలు చేపట్టేందు కు పటిష్టమైన విధానం అమలు చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేసిన కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవ్ సంస్థ తరఫు పిటిషనర్ మాట్లాడుతూ.. బార్లు, పబ్బులు, వైన్స్‌లు, ఇతర మద్యం విక్రయ కేంద్రాల వద్ద కస్టమర్ల వయసును నిర్ధారిం చేందుకు ఇప్పుడు న్న విధానం సరిగా అమలు కావడంలేదని ధ ర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. దీనిపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇందుకోసం 3 వారాల సమయం ఇచ్చిన కోర్టు అప్పటివరకు దీనిపై విచారణను వాయిదా వేసింది. అలాగే మద్యం డోర్ డెలివరీపై కూడా ఎలాంటి విధానం అవలంభి స్తున్నారో వివరణ ఇవ్వాలంది.