calender_icon.png 15 January, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలను విస్మరించిన మోడీ పాలన

31-08-2024 04:07:37 PM

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో విఫలం

సెప్టెంబర్ 2న జరిగే  ఆందోళనను జయప్రదం చేయండి

సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్

ఖమ్మం,( విజయక్రాంతి): పేదలను విస్మరించి మోడీ పాలన సాగిస్తున్నారని సంప్న వర్గాలు, కార్పోరేట్ శక్తుల కోసమే పాలన సాగుతుందని సిపిఐ జిల్లాకార్యదర్శి పోటు ప్రసాద్ ఆరోపించారు. పేద, మధ్యతరగతి ప్రజలు బ్రతకలేని దయనీయపరిస్థితి ఏర్పడిందన్నారు. సిపిఐ ఖమ్మం నగర ముఖ్యకార్యకర్తల సమావేశం శనివారం స్థానిక గిరిప్రసాద్భవన్లో మేకల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పోటు ప్రసాద్ మాట్లాడుతూ దశబ్దా కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయని అల్పాదాయ వర్గాల రాబడి కనిష్ట స్థాయి చేరిందన్నారు. ఆర్థిక అంతరాలు పెరుగుతూ పేదలు మరింత పేదలవుతుంటే ధనవంతులు కుభేరలవుతున్నారని ఇది దేశ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

గత పాలకులు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ చట్టాన్ని అమలు చేసేవారని మోడీ ప్రభుత్వం ధరల నియంత్రను పూర్తిగా విస్మరించిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు రసాయనిక ఎరువులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో ప్రతి 10 సంవత్సరాల కొకసారి జనగణన చేపట్టావారని మోడీ దానిని పట్టించుకోవడం లేదని ప్రసాద్ ఆరోపించారు. 2021లోనే జనగణన చేయవలసి ఉన్నా చేయక పోవడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఆశించిన స్థాయిలో దక్కడం లేదని ఆయన తెలిపారు. జనభా గణన చేపట్టాలని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, అర్హులందరికీ రేషన్కార్డులివ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2న ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ఆందోళనను జయప్రదం చేయాలని ప్రసాద్ కోరారు. ధరల నియంత్రణ జరిగేవరకు సి.పి.ఐ జాతీయ పిలుపులో భాగంగా దశలవారీ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో సి.పి.ఐ కార్యవర్గసభ్యులు తాటి వెంకటేశ్వరరావు, రావిశివరామకృష్ణ, వివిధ ఏరియాల పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.