calender_icon.png 27 April, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమ్మ గుడిలో ఘనంగా రుద్రహోమం..

26-04-2025 06:56:47 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవపురం జగన్నాధపురం గ్రామాల మధ్య విలిసిన కనకదుర్గ దేవాలయంలో (పెద్దమ్మ గుడి) మాస శివరాత్రి పురస్కరించుకొని దేవస్థాన కార్యనిర్మాణ అధికారిని ఎన్ రజనీకుమారి ఆదేశాల మేరకు శనివారం రుద్రహోమం ఆలయ ఆదరణలోని యాగశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మేల తాళాలతో వేదమంత్రాలతో అమ్మవారి స్వామివారి ఉత్సవమూర్తులను దేవాలయం నుండి పాఠశాలలు తీసుకువచ్చి మండపారాధన గణపతి పూజలు తదితర పూజలు జరిపి, అనంతరం రుద్రహోమం నిర్వహించారు.

అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అనుగ్రహం లో పాల్గొన్న దంపతులకు అర్చకులు ఆశీర్వచనంతో పాటు శేష వస్త్ర ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా ఆలయంలో శనీశ్వరునికి తైలాభిషేకం అర్చకులచే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అర్చకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.