calender_icon.png 14 January, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నాగబంధం’ రహస్యాన్ని విప్పే రుద్ర

14-01-2025 12:59:02 AM

యువ కథానాయకుడు విరాట్ కర్ణ నటిస్తున్న తాజా పాన్ -ఇండియా చిత్రం ‘నాగబంధం’. దీనికి ‘ది సీక్రెట్ ట్రెజర్’ అనేది ఉపశీర్షిక. ఒక ఎపిక్ అడ్వంచర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి ఎన్‌ఐకే స్టూడియోస్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు.

ఇందులో నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లు కాగా.. జగపతిబాబు, జయప్రకాశ్, మురళీశర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ ఆలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

భారతదేశంలోని విష్ణు ఆలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. అయితే ఈ చిత్ర కథానాయకుడు విరాట్ కర్ణ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రుద్రగా ఫెరోషియస్ రగ్గడ్ అవతార్‌లో సిక్స్ ప్యాక్ సాలిడ్ ఫిజిక్‌తో కనిపించాడు విరాట్.

సముద్రంలో భయంకరమైన మొసలితో పోరాడుతున్నట్టున్న అతని లుక్ ఆకట్టుకుంటోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో ఇదే ఏడాది విడుదల కానున్న సినిమాకు డీవోపీ: సౌందర్ రాజన్ ఎస్; సంగీతం: అభే; మాటలు: కళ్యాణ్ చక్రవర్తి; యాక్షన్: వెంకట్, వ్లాడ్ రింబర్గ్; ఎడిటర్: సంతోష్ కామిరెడ్డి.