ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి తాళ్ళపెళ్లి దివాకర్
కుమ్రం భీం ఆసిఫాబాద్,( విజయ క్రాంతి): సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి తాళ్లపల్లి దివాకర్ అన్నారు. ఆర్టీసీ రాష్ట్ర జెఎసి ఇచ్చిన పిలుపుమేరకు కేంద్రంలోని ఆర్టీసీ డిపో గేట్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తాళ్ళపెళ్లి దివాకర్ మాట్లాడుతూ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు, 2013 సంవత్సరం బాండ్ల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న రెండు పిఆర్సిలను వెంటనే అమలు చేయాలని, వెల్ఫేర్ బోర్డులను రద్దుచేసి ట్రేడ్ యూనియన్ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని ఈనెల 27న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన, సెప్టెంబర్ 10న డిమాండ్ డే నిరసన, అక్టోబర్ 1న ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని ఇందులో ఆర్టీసీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ డిపో అధ్యక్షులు ఎల్పుల అశోక్, సిపిఐ జిల్లా నాయకులు పిడుగు శంకర్ ఆత్మకూరు చిరంజీవి, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సురేష్,సులేమాన్,ఎజాజ్,ఉమేష్,ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.