calender_icon.png 5 October, 2024 | 2:55 PM

ఆర్టీసీ అమరవీరుల స్ఫూర్తితో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాడుతాం

05-10-2024 11:26:20 AM

కామారెడ్డి లో ఆర్టీసీ అమరవీరులకు నివాళులర్పించిన కార్మికులు

ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్

అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన ఆర్టీసీ కార్మికులు

కామారెడ్డి ( విజయక్రాంతి): అమరవీరుల స్ఫూర్తితో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాటం చేస్తామని ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి బాన్సువాడ ఆర్టీసీ డిపోల ఎదుట ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అమరవీరులైన ఆర్టీసీ కార్మికులకు నివాళులర్పించారు. అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తూ ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పించారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.  కార్మికుల భవితకై కార్మికుల హక్కుల సాధనకై ప్రాణాన్ని సైతం లెక్క చేయక అసూలు బాసి నింగికెగిన ధ్రువతారాలు లేరని మా ఉద్యమాలకు ముందుకు నడిపే దివ్యలు మీరేనని కార్మిక సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.

ప్రతి కార్మికుని ఎదలో జల్లించే విప్లవ జ్యోతులు కిరణాలు మీరే కానీ కొనియాడారు కార్మిక ఉద్యమాల చరిత్రలో కలకాలం నిలిచిపోయే చిరస్మరణీయులు మీరేనని పేర్కొన్నారు మీ ఆశయ సాధనే మా లక్ష్యం మీ కలల ఆకారమే మా ధ్యేయం నీ త్యాగం ఎన్నడూ వృధా కాదు ఎప్పటికైనా ఫలించకమాలలు అమరవీరులారా మీకు జోహార్లు అంటూ ఆర్టీసీ కార్మికులు అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేష్ ఆదిర్ కృష్ణమూర్తి సీతారాములు క్రాంతి వీడిదాస్ బుచ్చిరెడ్డి బాలయ్య రామచందర్ అమరవీరులకు పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుల స్ఫూర్తితో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాటం చేపడుతామని పేర్కొన్నారు కార్మిక సంఘాలను అనుమతించాలని అన్ని బకాయిలు చెల్లించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికులకు బకాయి పడ్డ వాటిని చెల్లించి ఆదుకోవాలని పేర్కొన్నారు. కామారెడ్డి బాన్సువాడ డిపోలో ఆర్టీసీ కార్మికులు అమరులకు ఘన నివాళులు అర్పించారు.