calender_icon.png 23 December, 2024 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ అమరుల ఆశయాలను సాధిస్తాం

06-10-2024 01:46:56 AM

ఆర్టీసీ జేఏసీ

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగుల న్యాయ మైన డిమాండ్ల సాధన కోసం 2019 లో జరిగిన 53 రోజుల సమ్మెలో 34 మంది ఆర్టీసీ కార్మికులు అమరులయ్యారని, అయినా అప్పటి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా సమ్మెను ఉక్కుపాదం తో అణచివేసిందని ఆర్టీసీ జేఏసీ చైర్మ న్ ఈదురు వెంకన్న పేర్కొన్నారు. అక్టోబర్ 5న ఆర్టీసీ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివా రం జేబీఎస్ వద్ద జరిగిన కార్యక్రమం లో ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వాలు ఎప్పటికీ కార్మికు ల పట్ల అణచివేత వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంటాయని, పోరాటంతో హక్కులను సాధించుకుంటామని తెలిపారు. ఈవీ బస్సులను ఆర్టీసీ, ప్రభు త్వం కొనుగోలు చేసి సంస్థకు అందించాలని జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ట్రేడ్ యూనియన్ల పునరుద్ధరణ, వేత న సవరణ, బాండ్ల డబ్బుల చెల్లింపు లు తదితర సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జేఏసీ కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్లు యా దయ్య, సురేశ్,యాదగిరి పాల్గొన్నారు.