calender_icon.png 18 March, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఆర్టీసీ చర్చలు మరోసారి వాయిదా

18-03-2025 12:00:00 AM

ఈ నెల 21న చర్చకు రావాలని నోటీసులు

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాం తి): ఆర్టీసీ చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. సమ్మె నోటీసుపై యాజమాన్యాన్ని, కార్మిక సంఘాలను సోమవారం సాయం త్రం 4 గంటలకు చర్చలకు హాజరు కావాల ని కార్మిక శాఖ ఆహ్వానించింది. కార్మిక సం ఘాలు వచ్చినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం గైర్హాజరైంది.

గతంలో ఎన్నికల కోడ్ పేరిట చర్చలకు రాని ఆర్టీసీ యాజమాన్యం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే డుమ్మా కొట్టిందని కార్మిక శాఖ తెలిపింది. ఈ నెల 21న మరోసారి చర్చలకు రావాలంటూ ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు జారీ  చే సినట్లు  కార్మిక శాఖ అధికారులు తెలిపారు.

యాజమాన్యం చర్యలకు ఎందుకు రాలే దో కారణం చెప్పాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈ దురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి ప్ర శ్నించారు. కార్మికుల సమస్యలపై, ఆర్టీసీ భవితవ్యంపై చర్చించేందుకు ఈ నెల 21న యా జమాన్యం చర్చలకు హాజరు కావాలన్నారు.