calender_icon.png 8 April, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ సమ్మెసైరన్

08-04-2025 01:47:03 AM

మే 7 నుంచి.. 21 అంశాలతో నోటీసు

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు.. జేఏసీ అల్టిమేటం

హైదరాబాద్, ఏప్రిల్ 7(విజయ క్రాంతి) : వచ్చే నెల 7వ తేదీన మొదటి షిఫ్టు (6వ తేదీ అర్ధరాత్రి) నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసింది. సోమవారం సాయంత్రం లేబర్ కమిషనర్ కార్యాల యం వద్ద జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తదితరులు ఈ మేరకు ప్రకటించారు. 21 అంశాలతో తాము సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.

తమ సమస్యల పరిష్కా రం కోసం ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తిచేసినా పెడచె విన పెట్టారని, కనీసం తమ సమస్యల పరిష్కారంపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని జేఏసీ వెల్లడించింది. ట్రేడ్ యూనియన్ల పునరుద్ధరణకు ఎన్నికల హమీ ఇచ్చినప్పటికీ, ఇందుకు పైసా ఖర్చు లేనప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం ఒంటెత్తు పోకడలతో పరిష్కరించలేదని జేఏసీ ఆరోపిం చింది.

సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన కార్మిక శాఖ కూడా వైఫ ల్యం చెందిందని జేఏసీ పేర్కొంది. వచ్చే నెల 6వ తేదీలోపు ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె జరుగుతుందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న స్పష్టం చేశారు.

తమ ప్రధాన డిమాండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు  వేతన సవరణ ఎరి యర్స్ చెల్లింపు, రిటైర్డ్ ఉద్యోగుల వేతన సవరణకు పే ఫిక్సేయన్, బ్రెడ్ విన్నర్ స్కీం ఉద్యోగులకు కన్సాలిడేటెడ్ పే కాకు ండా రెగ్యులర్ వేతనాలు, కార్మికులపై పనిభారం తగ్గింపు, బ్రీత్ అనలైజర్ల పేరిట కార్మికులపై వేధింపులు, ఎలక్ట్రిక్ బస్సులను నేరుగా సంస్థకే అప్పగించడం, వెం టనే నియామకాలు చేపట్టాలనే తదితర 21 డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు నోటీసు ఇచ్చింది.

తమ సమస్యలపై ఏ మాత్రం పట్టింపు లేకుండా ప్రవర్తించినందుకే సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం, యాజమాన్యానిదే పూర్తి బాధ్యత అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ కే హనుమంత్ ముదిరాజ్, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు యాదయ్య, సురేశ్, యాదగిరి తదితరులు ఉన్నారు. 

పట్టించుకోకపోవడం వల్లే..

ఈ ఏడాది జనవరి 27న ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిం ది. అయితే యాజమాన్యం మాత్రం ఈ అంశంపై ఏ మాత్రం పట్టించుకోలేదని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 10న కార్మిక సంఘాలు, ఆర్టీసీ యాజమాన్యాన్ని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుగా చూపి యాజమాన్యం చర్చలకు రాలేదు.

ఈనెల 17న మరోసారి పిలిస్తే కూడా యాజమాన్యం మళ్లీ గైర్హాజరయ్యింది. ఈనెల 21న మూడోసారి చర్చలకు పిలిచినా ఆర్టీసీ తరఫున ఎవరూ రాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఛలో లేబర్ కమిషనర్ అనే కార్యక్రమానికి జేఏసీ పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల నుంచి అనేక మంది కార్మికులు ఈ కార్యక్రమానికి హాజరై జేఏసీకి తమ మద్దతును తెలిపారు.