సన్మానించిన యాజమాన్యం
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాం తి): విధి నిర్వహణలో మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్‌ఆర్టీసీ యాజమా న్యం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ బస్ భవన్‌లో బుధవారం ఉన్నతాధికారుల తో కలిసి మణుగూరు డిపో డ్రైవర్ కోటేశ్వరరావు, గద్వాల్ డిపో కండక్టర్ కిశోర్ కుమా ర్, డ్రైవర్ నరేందర్ గౌడ్, జగిత్యాల డిపో మేనేజర్ సునీతను సంస్థ ఎండీ వీసీ సజ్జనా ర్ సత్కరించారు.
మణుగూరు డిపోకు చెంది న బస్సులో గతేడాది డిసెంబర్ 21న ప్రయాణికురాలి 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. బాధితురాలు విషయం డ్రైవర్ కోటేశ్వరరావుకు చెప్పారు. ఓ ప్రయాణికురాలు బ్యాగుతో పారిపోతుండగా.. డ్రైవర్ గమనించి అపహరించిన మహిళను పోలీసులకు అప్పగించారు. పోలీసుల సహకారంతో 10 తులాల ఆభరణాల ను ప్రయాణికురాలికి ఇప్పించారు.
ప్రయాణికురాలికి గుండెపోటు.. డీఎం సీపీఆర్
జగిత్యాల బస్‌స్టేషన్‌లో జనవరి 12న ఒక ప్రయాణికురాలికి గుండెపోటు వచ్చింది. సంక్రాంతి ఆపరేషన్స్‌లో భాగంగా అక్కడే విధులు నిర్వహిస్తున్న డీఎం సునీత.. వెంట నే స్పందించి ఆమెకు సీపీఆర్ చేశారు. అనంతరం 108 సాయంతో జగిత్యాల దవాఖాన లో చేర్చారు. సకాలంలో స్పందించడంతో ప్రాణాప్రాయం తప్పింది.
సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బందిని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఐసీఎస్ అభినందించా రు. ఆర్టీసీ బస్సులు, స్టేషన్లలో జన్మించిన పిల్లలకు జీవితకాల ఉచిత బస్‌పాస్ ఇవ్వాల ని గతంలో యాజమాన్యం నిర్ణయించిన నేపథ్యంలో.. గద్వాల డిపో బస్సులో జన్మించిన ఆడపిల్లకు లైఫ్ టైమ్ ఫ్రీ బస్‌పాస్ యా జమాన్యం మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
బస్సులో ప్రసవం.. ఆర్టీసీ సిబ్బంది ఉదారత
గద్వాల డిపోకు చెందిన బస్సులో జనవరి 2న రాయచూర్ నుంచి గద్వాలకు ప్రయాణిస్తుంది. అందులో ప్రయాణిస్తున్న ఒక గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. గమనించిన కండక్టర్ కిశోర్ కుమార్.. డ్రైవర్ నరేందర్‌గౌడ్‌కు సమాచారమిచ్చాడు.
వెంటనే బస్సును పక్కకు ఆపి.. 108కి సమాచారం ఇచ్చారు. అంతలోనే పురిటినొప్పులు ఎక్కువ కావడంతో తోటి ప్రయాణికురాళ్ల సహకరించాలని కోరారు. వారు పురుడుపోయడంతో గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లిబిడ్డను ఆస్పత్రిలో చేర్చించారు.