11-03-2025 01:03:06 AM
నిజామాబాద్, మార్చి 10 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపో నుండి ధర్మపురి కి ప్రత్యేక బస్సులు నడపన్నట్టు డిఎం రవికుమార్ తెలిపారు. లక్ష్మీ నరసింహ స్వామి జాతరకు ఈనెల 11 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి స్కీం వర్తిస్తుందని ఆయన తెలిపారు. పెద్దలకు 220 రూపాయలు పిల్లలకు ఒక వంద 20 రూపాయల ఛార్జ్ ఉంటుందని ఆర్మూర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ రవికుమార్ కోరారు.