calender_icon.png 11 January, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

11-01-2025 01:47:27 AM

  • ప్రైవేట్ బస్సుల్లో అదనపు చార్జీలు తీసుకుంటే చర్యలు

రవాణాశాఖ మంత్రి పొన్నం

హైదరాబాద్, జనవరి 10(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సు లు నడపాలని నిర్ణయించినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులను శుక్రవారం నుంచి ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అవసరాన్ని బట్టి ఆర్టీసీ మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

ప్రతీ మేజర్ బస్ స్టేషన్ వద్ద ప్రత్యేక అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పా ట్లు చేయాలని మం త్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పండగ పూ ట ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అదనపు చార్జీలు వసూలు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలనే వసూలు చేయాలని, లేదంటే  బస్సులు సీజ్ చేస్తామని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అదనంగా వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.