05-04-2025 12:00:00 AM
మంథని డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్
మంథని మార్చి 04 (విజయక్రాంతి) : శ్రీ రామనవమి కళ్యాణోత్సం కోసం మంథని నుండి భద్రాచలం వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు మంథని డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి, ఆదివారం కల్యాణోత్సవం తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరిగి మంథని కి బయలుదేరుందని పేర్కొన్నారు.
దీనికి ఫుల్ టికెట్ రూ. 450 రూపాయలు హాఫ్ టికెట్ రూ. 225 రూపాయలు గా ఉంటుందని తెలియజేశారు. ఈ బస్సు ప్రయాణంలో మహిళలకు మహాలక్షి పథకం ఉచిత బస్సు ప్రయాణం వర్తించదనీ తెలిపారు. ఈ బస్సు సౌకర్యం భక్తులు సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు.