calender_icon.png 31 October, 2024 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

31-10-2024 01:48:19 AM

మంత్రి శ్రీధర్‌బాబుకు యూనియన్ నేతల వినతి

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ నేతలు బుధవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు.

కార్మికుల విజ్ఞప్తులను ప్రభు త్వం దృష్టికి తీసుకుపోతామని మంత్రి హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కూడా టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతలు వినతిపత్రం అందించారు.