calender_icon.png 2 November, 2024 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు

12-05-2024 06:46:46 PM

హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ క్రమంలో నగరంలోని ఓటర్లతో పాట వివిధ జిల్లాలకు చెందిన  ఓటర్లు తమ సోంత గ్రామాల్లో ఓటు వేసేందుకు పయనం అయ్యారు. దీంతో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై ఆర్‌టిసి ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా  స్పందించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళే ప్రయాణికులకు సౌకర్యార్దం ఆర్‌టిసి యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందన్నారు. ఏపీ వైపు ఇప్పటి వరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా, తాజాగా హైదరాబాద్   విజయవాడ మార్గంలో 140 సర్వీలను ఆన్‌లైన్‌లో మందుస్తు రిజర్వేషన్ కోసం ప్రవేశ పెట్టిందన్నారు. ఆయా బస్సుల్లో సుమారు 3 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని, విజయవాడ మార్గంలో వైపు వెళ్ళే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సంస్థ కోరుతుందన్నారు. టికెట్లు ముందస్తు రిజర్వేషన్ కోసం  సంస్థ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. ప్రస్తుతం  హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు 1500 ప్రత్యేక  బస్సులను సంస్థ నడపుతోందన్న ఆయన  జెబిఎస్, ఎంజిబిఎస్, ఉప్పల్,ఎల్‌బినర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ఈ  బస్సులను నడుపుతోందన్నారు.ప్రయాణికులు రద్దీని బట్టి  ఎప్పటికప్పుడు బస్సులు అందుబాటులో ఉంచాలని క్షేత్ర స్థాయి అధికారులకు యాజమాన్యం ఆదేశించిందన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సరక్షితంగా సొంతూళ్ళకు వెళ్ళి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించు కోవాలని సంస్థ ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.