26-01-2025 12:00:00 AM
కార్మికులు భారీగా తరలిరావాలని పిలుపు
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన సర్కారు, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ ఆర్టీసీని కనుమరుగు చేసే ప్రయత్నాన్ని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధమవుతోందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 27న ఆర్టీ సీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన ఆర్టీసీ కార్మికులంతా భారీ ర్యాలీగా బస్‌భవన్ చేరుకుని యాజమాన్యానికి సమస్యలపై సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.