calender_icon.png 24 November, 2024 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మహాలక్ష్మి’తో ఆర్టీసీకి సిరులు

24-11-2024 02:40:08 AM

  1. ఈ నెల 20 నాటికి 111 కోట్ల జీరో టికెట్లు 
  2. ఈవీ పాలసీపై అవగాహన కల్పించాలి
  3. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘మహాలక్ష్మి’ పథకంతో ఆర్టీసీకి సిరు లు కురుస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో టీజీఎస్ ఆర్టీసీ, రవాణా శాఖపై మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు.

నవంబర్ 20 వరకు ఆర్టీసీ 111 కోట్ల జీరో టికెట్లను జారీ చేసిందని, ఫలితంగా రూ.3,747 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని మంత్రి పే ర్కొన్నారు. జీరో టికెట్ల రీయింబర్స్‌మెంట్ ను ఆర్టీసీకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లిస్తోందని వివరించారు. ‘మహాలక్ష్మి’ అమలు కు ముందు 69 శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేషి యో (ఓఆర్) ప్రస్తుతం 94 శాతానికి పెరిగిందన్నారు.

ప్రయాణికుల్లో 65.56 శాతం మహిళలే ఉంటున్నారని, ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదన్నారు. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుకు ప్రణాళికలు రూ పొందించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. మొదటి విడతగా మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మండల మహిళా సమాఖ్యలకు ఒకటి చొప్పున అద్దె బస్సులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

సమావేశంలో రవాణా, రోడ్లు భవనాల శా ఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్‌కుమార్, ఫైనాన్స్ అడ్వజర్ విజ యపుష్ప, హెచ్‌వోడీలు పాల్గొన్నారు.

౧౫ ఏళ్లు దాటితే సీజ్..

పలువురు రవాణా శాఖ అధికారుల పనితీరు మెరుగుపడాలని మంత్రి సూచించారు. స్కూల్ బస్సులపై నిరంతరం తనిఖీలు చేస్తూ.. 15 ఏళ్లు దాటిన వాటిని సీజ్ చేయాలన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 25వేల స్కూల్ బస్సులతోపాటు 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరుపై నివేదికలు ఇవ్వాలన్నారు. కొత్త ఆర్టీఏ కార్యాలయ భవనాల నిర్మాణం, చేపట్టాల్సిన మౌలిక వసతులపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

15 ఏళ్లు దాటిన ప్రైవేట్ వాహనాలకు గ్రీన్‌టాక్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఈవీ పాలసీపై ప్రజలకు అవగాహన కల్పించి మరిన్ని వాహనాలను కొనుగోలు చేస్తూ కాలుష్యాన్ని అరికట్టాలన్నారు. సమావేశంలో రవాణాశాఖ ప్రత్యేక శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, జేటీసీలు రమేశ్, మమత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.