పిట్లం మండల కేంద్రంలో ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగి చెరువులో పడి మృతి చెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కాంతయ్య 48 సంవత్సరాలు చెరువులో పడి మృతి చెందాడు. మంగళవారం 10 గంటలకు రాత్రి ఇంటి నుంచి వెళ్లిన కాంతయ్య తిరిగి ఇంటికి రాలేదు. బుధవారం స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వెళ్లి చూడగా కాంతయ్య మృత దేహమని కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రమాదవశాత్తు పడి మరణించారా లేక కుటుంబ సమస్యలతో మరణించాడా అని కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పిట్లం ఎస్ఐ రాజు తెలిపారు.