calender_icon.png 30 April, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

29-04-2025 07:40:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రతిరోజు నిర్మల్ నుండి ఆంధ్రప్రదేశ్ లో గల అమలాపురానికి లహరి నాన్ ఏసీ బస్సు వెళ్తుంది. హైదరాబాద్ లో బస్సు ఎక్కి అమలాపురంలో బాపూజీ అనే టేక్ మహేంద్ర కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేసే ప్రయాణికుడు 80 వేల రూపాయల కంపెనీ ల్యాప్ టాప్ మరిచిపోయి బస్సు దిగిపోయాడు. అమలాపురంలో బస్సు ఆపిన డ్రైవర్లు ఎమ్. ఎన్. మూర్తి, ఆదినారాయణ ల్యాప్ టాప్ ను గమనించి బ్యాగ్ విప్పారు, దానిలో అతని ఐడి కార్డుపై ఉన్న ఫోన్ నంబరుకు ఫోన్ చేసి బాపూజిని పిలిపించి ల్యాప్ టాప్ బ్యాగ్ అప్పగించడం జరిగింది. ల్యాప్ టాప్ పోతే నా ఉద్యోగమే పోయి ఉండేదని డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. నిజాయితీ చాటుకున్న ఎమ్. ఎన్. మూర్తి, ఆదినారాయణను డిపో మేనేజర్ కే. పండరి అభినందించారు.