19-02-2025 09:49:04 AM
బస్సులో ప్రయాణిస్తున్న బాలికను ప్రేమ పేరుతో వంచన.
బిడ్డ పుట్టాక ప్లేట్ ఫిరాయింపు.
షీ టీం ను ఆశ్రయించిన బాధితులు కేసు నమోదు.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వంచించి బుట్టలో వేసుకొని తీర బిడ్డ పుట్టాక ఆర్టీసీ డ్రైవర్ ప్లేట్ ఫిరాయించాడు. అప్పటికే తనకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారంటూ తప్పించుకోవడంతో షీ టీం ను ఆశ్రయించగా కేసు నమోదు అయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే భూత్పూర్ మండలం పెద్ద మొల్గర గ్రామానికి చెందిన ఎండి జాఫర్ ప్రైవేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక పది పూర్తి చేసుకున్న తర్వాత మహబూబ్నగర్ లో ఉన్నత విద్య కోసం బస్సులో ప్రయాణిస్తూ ఉండేది. అటుగా వెళ్లే బస్సు డ్రైవర్ బాలిక పట్ల ప్రేమ పేరుతో పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా గర్భం దాల్చాక ప్లేట్ కఫిరాయించడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి పెళ్లికి ఒప్పించారు. కానీ అప్పటికే అతడికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నప్పటికీ మహబూబ్నగర్ ప్రాంతంలో మరో ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు. కొద్ది రోజులకు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించి నాగర్ కర్నూల్ షీ టీం ను ఆశ్రయించారు. దీంతో షీ టీం ఇన్చార్జ్ విజయలక్ష్మి జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్ ఆదేశాల మేరకు బిజినపల్లి మండల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ బాలికకు ఏడాది వయసు బాబు కూడా ఉన్నాడు.