కొండపాక, అక్టోబర్ 6: సైదపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన ఠాకుర్ రమేశ్ సింగ్ (46) ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా ఆదివారం ఉదయం ప్రయాణికులను హుజురాబాద్ డిపో నుంచి హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో గుండెపోటు రావడంతో డ్రైవర్ సీటులోనే కుప్ప కూలిపోయాడు. ప్రయాణికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. రమేశ్ సింగ్‌కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.