ఇద్దరిపై కేసు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఈ నెల 20న కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కుషాయిగూడకు వెళ్తున్నది. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో తమకు దారి ఇవ్వలేదనే ఉద్దేశంతో ఇద్దరు బస్సును ఆపి డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ దాడికి పాల్పడిన ఆటో ట్రాలీ డ్రైవర్ జాన్‌ను పోలీసులకు అప్పగించారు. తాజాగా దాడికి పాల్పడిన మరో వ్యక్తి జగదీశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. జాన్, జగదీశ్‌పై కేసు నమోదు చేశా రు. దాడిలో గాయపడిన ఆర్టీసీ డ్రైవర్‌ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో పరామర్శించారు.