calender_icon.png 27 October, 2024 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ కార్గో.. ఇక హోం డెలివరీ

27-10-2024 12:00:00 AM

  1. నేటి నుంచి హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా డెలివరీ
  2. త్వరలోనే రాష్ర్టవ్యాప్తంగా హోం డెలివరీ
  3. మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): తమ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెం చుకునేందుకు లాజిస్టిక్స్ (కార్గో) సేవలను టీజీఎస్ ఆర్టీసీ మరింతగా విస్తరిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో వేగవంతమైన సేవ లను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ఒక ప్రకటనలో వివరించారు.

ఆదివారం నుంచి హైదరాబాద్‌లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివరీ సేవలు అందుబాటులో ఉం టాయని వివరించారు. టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్‌లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్‌ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రజలందరూ హోం డెలివరీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను మంత్రి కోరారు.

  • పార్సిల్స్ హోం డెలివరీ చార్జీలివే!

* 0 నుంచి 1 కేజీ రూ.50

* 1 నుంచి 5 కేజీల వరకు రూ.60

* 5 నుంచి 10 కేజీల వరకు రూ.65

* 10 నుంచి 20 కేజీల వరకు రూ.70

* 20 నుంచి 30 కేజీల వరకు రూ.75

* 30 కేజీలు దాటితే రూ. 75 ప్లస్ స్లాబ్‌ల మేరకు ధరలు వర్తిస్తాయి.