కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కాలనీల అభివృద్ధి
మహేశ్వరం,(విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్స్ కు రవాణా శాఖ మంత్రి పొన్నం(Minister Ponnam Prabhakar), ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కృషితో ప్రభుత్వంఎస్ డిఎఫ్ నిధులు రూ.10 కోట్లు కేటాయించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో డివిజన్ నాయకులు సహా ఆర్కేపురం కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.