03-03-2025 01:52:07 AM
ఎల్లారెడ్డి, మార్చి 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బస్టాండుకు ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించ డంలేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. ఆదివారం సంతకావడంతో పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి బస్సుల కోసం ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆర్టీసీ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నాడు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో వారంత సంత ఉండటంతో ఎల్లారెడ్డి పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పట్టణ కేంద్రానికి చేరుకొని తిరుగు ప్రయాణం కోసం ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వైపు, బాన్సువాడ వైపు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికు లు గంటల తరబడి ఎదురుచూస్తూ ఇబ్బందులు పడ్డారు.
సంతతో పాటు పెండ్లిల్లు కార్యక్రమాల కాదన పలు గ్రామాల ప్రజలు సమయానికి బస్సులు రాకపోవడంతో ఆర్టీసీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.ఒకేసారి వరుసగా 2,3 బస్సులు రావడం సరైన విధానం కాదని మండి పడ్డారు.
ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు. ఎల్లారెడ్డి నుండి నిత్యం వేలాదిమంది ప్రయాణించే బాన్సువాడ మెదక్ కామారెడ్డి ప్రాంతాలకు ప్రయాణించే వారికి సరైన సమయానికి బస్సుల సౌకర్యం కల్పించాలని ప్రజలు ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.