బస్‌భవన్ ఎదుట సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నేతల ధర్నా
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11(విజయక్రాంతి) : ప్రయాణికులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను పెంచాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు కె.రమా, చిన్న చంద్రన్న, చండ్ర అరుణ, ఆవుల అశోక్, ఎస్‌ఎల్ పద్మ, సి.వైపుల్లయ్య తదితరులు డిమాండ్ చేశారు.
ఈమేరకు బుధవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బస్ భవన్ ఎదుట సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, అదే సందర్భంలో 3 వేల పాత బస్సులను తొల గించారని విమర్శించారు.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. ప్రయాణికుల సంఖ్యకు తగినట్లుగా బస్సులను నడపాలని డిమాండ్ చేవారు. ధర్నాలో సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ హైదరాబాద్ కార్యదర్శి హన్మేశ్, టీయూసీఐ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కే సూర్యం, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు స్వరూప, పీవైఎల్ రాష్ర్ట అధ్యక్ష కార్యదర్శులు అజయ్, ప్రదీప్, పీడీఎస్‌యూ అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు.