calender_icon.png 5 March, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు

05-03-2025 12:51:46 AM

మహిళా దినోత్సవం సందర్భంగా తీపికబురు

  1. 600 బస్సులు కేటాయించనున్న రాష్ట్రప్రభుత్వం
  2. తొలివిడతలో 150 బస్సులు.. రెండో విడతలో మిగతా 450
  3. 8న 50 బస్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి) : మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఇప్పటికే ‘మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం వారి ఆర్థిక స్వావలంబన కోసం మరో నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా మండల సమాఖ్యలకు తీపికబురు అందించింది.

సర్కార్ 600 బస్సులను మహిళా సమాఖ్యలకు కేటాయించి, తద్వారా వారికి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయనున్నది. దీనికి సంబంధించిన జీవోను మంగళ వారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ విడుదల చేసింది. మహిళా సమా ఖ్యలకు బస్సులు కేటాయించడం దేశంలోనే ఇది మొదటిసారి కావడం విశేషం.

ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 50 బస్సులను మహిళా సమాఖ్యలకు అప్పగించనున్నారు. 

మొదటి దశలో 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో..

ప్రభుత్వ ష్యూరిటీతో అందుకున్న బస్సులను మహిళా మండల సమాఖ్యలు ఆర్టీసీ యాజామాన్యానికి అప్పగించనున్నాయి. ఒక్కో బస్సుకు యాజమాన్యం ప్రతి నెలా 5వ తేదీ లోపు రూ.77,220 చొప్పున అద్దె చెల్లించనున్నది. తద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సర్కార్ ఊతమివ్వనున్నది. ఒక్కో బస్సు ధర రూ.36 లక్షలు కాగా,  వడ్డీ 9.51%తో ఏడేళ్ల పాటు కిస్తీలు చెల్లించాల్సి ఉంటుంది.

బస్సుల రిజిస్ట్రేషన్ టీజీఎస్‌ఆర్టీసీ పేరుతో ఉంటుంది. బీమా ఖర్చులను మాత్రం మహిళా సంఘాలే భరించాల్సి ఉం టుంది. బస్సులను ఆర్టీసీ పేరిట కొనుగోలు చేస్తున్నందున ప్రత్యేకంగా ప్రొక్యూర్‌మెంట్ కమిటీ ఏర్పాటు అవసరం కూడా లేకపోయింది. బస్సులకు సంబంధించిన పెట్టుబడి ఆర్టీసీ, మహిళా సంఘాలు సగం సగం పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

600 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అద్దె బస్సులతో ఆర్టీసీ కార్మికులకు పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఇప్పుడు ఆర్టీసీ పేరిట మహిళా సంఘాలు కొనుగోలు చేస్తున్న బస్సులకు డ్రైవర్లు మా కార్మికులే ఉంటారు.

వాటి నిర్వహణను సైతం ఆర్టీసీ యాజమాన్యమే చూసుకుంటుంది. తద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వ్యక్తులతో కొనుగోలు చేస్తేనే ఆర్టీసీకి పెద్ద ప్రమాదం. ఎలక్ట్రిక్ బస్సులను సైతం ప్రభుత్వమే కొని ఆర్టీసీకి అప్పగించాలి.

 థామస్‌రెడ్డి,

 ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్

మహాలక్ష్మి పథకం కోసమేనా..

మహిళా సమాఖ్యలకు కేటాయించిన 600 బస్సులనూ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లకు వినియోగిస్తారని తెలిసింది. అదే నిజమైతే.. ఆ బస్సులన్నీ మహాలక్ష్మి పథ కం కోసమే ఉపయోగిస్తున్నట్లే లెక్క. తొలి విడతగా 150 మండలాల పరిధిలోని మహిళా సమాఖ్యలకు 150 బస్సు లు అప్పగించనున్నది.

అందుకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల (ఉమ్మ డి ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలు) పరిధిలోని 150 మండల మహిళా సంఘాలను గుర్తించారు. రెండో విడతలో మిగిలిన 450 మండల సమాఖ్యలకు బస్సులు అందించన్నారు.