హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (విజయక్రాంతి): టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షలకు అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్ శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సులభంగా వెళ్లేందుకు మార్గనిర్దేశం చేయడానికి, ఆయా బస్టాప్‌లు, బస్టాండ్‌లలో ఆర్టీసీ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసిందన్నారు. సందేహాల కోసం కోఠి బస్‌స్టేషన్ 99592 26160, రేతిఫైల్ బస్‌స్టేషన్ 99592 26154 నంబర్లను సంప్రదించాలన్నారు.