calender_icon.png 18 April, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాలేశ్వరం జాతరకు అందుబాటులో ఆర్టీసీ బస్సులు.!

11-04-2025 10:33:20 AM

శాలేశ్వరం జాతరకు అందుబాటులో ఆర్టీసీ బస్సులు.!

ఈ నెల 13 సాయంత్రం వరకు సేవలు

నిత్యం 36 బస్సుల చొప్పున ఏర్పాట్లు

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): దక్షిణ ప్రాంత అమర్నాథ్ యాత్రా(Amarnath Yatra)గా పేరొంది నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన సలేశ్వరం లింగమయ్య స్వామి(Saleshwaram Lingamayya Swamy Temple) దర్శనం కోసం వేలాదిగా తరలి వెళ్తున్న భక్తుల సౌకర్యం ప్రభుత్వం ఆర్టిసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని నాగర్కర్నూల్ డిపో అసిస్టెంట్ మేనేజర్ బాల సరస్వతి పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం సలేశ్వరం ప్రత్యేక బస్సులను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 13 సాయంత్రం 6 గంటల వరకు నిత్యం 36 బస్సులు అందుబాటులో ఉంచామని ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సురక్షితంగా జాతర ముగించుకోవాలని సూచించారు. అచ్చంపేట ప్రస్తుత 11, నాగర్ కర్నూల్ బస్సు డిపోలో 25 బస్సుల చొప్పున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారితోపాటు ఆర్టీసీ సిబ్బంది విఎస్ నారాయణ, అశోక్ రెడ్డి బాలు రాజు, ప్రవీణ్ తదితరులున్నారు.