calender_icon.png 27 December, 2024 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్దెకు అందుబాటులో ఆర్టీసీ బస్సులు

03-11-2024 02:12:37 PM

డిపో మేనేజర్ విశ్వనాథ్

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయ క్రాంతి): ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని గమ్యాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవచ్చని డిఎం విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విహారయాత్రలు, వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులను ఇవ్వనున్నట్లు వివరించారు.

ప్రయివేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదన్నారు. ఆర్టీసీ బస్సులను ఎంతో అనుభవం కలిగిన డ్రైవర్ల తో నడిపించడం జరుగుతుందన్నారు. ఎలాంటి సందర్భంలోనైనా ఫ్రైవేట్ వాహనాలను కాకుండా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకువెళ్లచ్చని తెలిపారు. అందరికీ అనుగుణంగా సరసమైన ధరలకు సంస్థ నిర్ణయించిన ధరలకే బస్సులను అద్దెకు ఇవ్వడం  జరుగుతుందన్నారు. డిపో పరిది లోని ప్రయాణికులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.  మరింత సమాచారానికి 9959226006, 9441596246,9440464035 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో డిపో సిబ్బంది, ఉద్యోగులు ,తదితరులు పాల్గొన్నారు.