వరదనీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
రాత్రంతా బస్సులో నే ప్రయాణికులు
నెక్కొండ: వరంగల్ - మహబూబాబాద్ రహదారి వద్ద నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో మత్తడి చెరువు పొంగిపొర్లుతోంది. తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగడంతో కట్టపై వరద నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. తమను కాపాడాలంటూ బంధువులకు అధికారులకు సమాచారం అందించిన ప్రయాణికులు. వరద నీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లలేని స్థితిలో ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు.