భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలో రూ.కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలు నిరుపయోగంగా మారాయి. దమ్మపేట, బూర్గంపహాడ్‌లోని బస్టాండ్‌లు ఏళ్ల నుంచి వినియోగించకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. గోడలు కూలి భూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు రోడ్ల పక్కన నించొనే బస్సులు ఎక్కుతున్నారు. ఇప్పటికే ఆయా బస్టాండు స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. రాత్రిళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. రూ.కోట్ల విలువైన భూములను పరిరక్షించాలని, వేచి చూసేందుకు వీలుగా బస్టాండులను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.