calender_icon.png 7 March, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా

06-03-2025 12:46:34 AM

పలువురికి తీవ్ర గాయాలు 

ఖమ్మం, మార్చి 5 (విజయక్రాంతి ):  ఆర్టీసీ బస్సు అదువు తప్పి బోల్తా పడిన ఘటన కొణిజర్ల మండల పరిధిలోని తనికెళ్ల సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాల ప్రకారం సత్తుపల్లి డిపోకు చెందిన ఇంద్ర సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి సత్తుపల్లి వెళుతున్న క్రమంలో ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించేందుకు ప్రయత్నించగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది.

దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణి కులు ఊపిరి పీల్చుకున్నారు. క్షత గాత్రులను ఖమ్మం ప్రభుత్వ అస్పత్రికి తరలి ంచి చికిత్స చేస్తున్నారు. కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన పై మంత్రి పొంగులేటి విచారం 

ఇంద్ర బస్సు బోల్తా పడిన ఘటన పై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఘటనలో తీవ్ర గాయాలు అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యులను ఆదేశించారు. ప్రమాద ఘటన పై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.