25-04-2025 01:24:56 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 24: యూ టర్న్ వద్ద డీసీఎం వ్యాన్ ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలైన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెం దిన షేక్ మునీర్ బాలానగర్ మండలం పరిధిలోని మోతి ఘనపూర్ గ్రామంలో ఉన్న ఓ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
బుధవారం మధ్యాహ్నం 3 గం టలకు అతడు ఇటుకలలోడుతో శంషాబాద్ కు బయలుదేరాడు. ఈక్రమంలో గండిగూ డ గ్రామం యు టర్న్ సమీపంలో ఓ కారు డీసీఎం ముందుకు వచ్చింది. కారు నెమ్మదిగా కావడంతో షేక్ మునీర్ తన డీసీఎం ను కూడా స్లో చేశాడు.మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో బస్సు వెనుక నుంచి డీసీఎం ను ఢీకొంది. ఈ ప్రమాదం లో డీసీఎం ఎడమ వైపు భాగం దెబ్బతింది.
బస్సు డ్రైవర్ తో పాటు ప్రయాణీకులు సుజాత, నూర్జహాన్ శరీర భాగాలకు రక్త గాయాలయ్యాయి. గా యపడిన వారిని చికిత్స కోసం శంషాబాద్లోని అర్కాన్ ఆసుపత్రికి తరలించారు. బ స్సు డ్రైవర్ మల్లేష్ నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ డీసీఎం డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.