17-12-2024 12:16:01 AM
ఒకరి దుర్మరణం, నలుగురికి గాయాలు
గజ్వేల్ అవుటర్..శివారులో ఘటన
గజ్వేల్, డిసెంబర్16: ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న ఓ మహిళ దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన గజ్వేల్ అవుటర్ రింగ్ రోడ్డు సర్కిల్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ దమ్మాయిగూ డలో నివాసం ఉంటున్న సుధాకర్, శ్రావణి దంపతులు వారి కుమారులు సాయినాథ్, లిఖిత్ సాయి, గణేశ్ (సుధాకర్ సోదరుడు) తో కలిసి సోమవారం వారి కారులో స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామా నికి వెళ్తుండగా గజ్వేల్ రింగ్‌రోడ్డు పై నుంచి రాజీవ్ రహదారిపై వస్తున్న క్రమంలో జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వారి కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు లో ప్రయాణిస్తున్న అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే శ్రావణి మృతి చెందింది. ఆమె పిల్లలు సాయినాథ్, లతిక్‌సాయి పరిస్థితి విషమంగా ఉండటంతోమెరుగైన వైద్యం కోసం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.