పచ్చ జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: కొల్లాపురం పట్టణం నుండి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఆర్టీసీ బస్సును పచ్చ జెండా గోపి ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుండి రెండు గంటల వరకు శ్రీశైలానికి వెళ్లి 2:30 నుండి తిరిగి కొల్లాపూర్ పట్టణానికి 6 గంటల వరకు చేరుకునెలా ఎక్స్ప్రెస్ బస్సు ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటిరోజు 30 మందితో శ్రీశైలానికి వెళుతూ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో పాటు వీపనగండ్ల మండల కేంద్రం నుండి గోపాల్ దిన్నె మీదుగా కర్నూలు వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. వారితోపాటు డిపో మేనేజర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.