calender_icon.png 28 February, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం డ్రైవర్ కు గాయాలు

28-02-2025 01:05:46 AM

గుడిహత్నూర్, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి) :  జిల్లాలో ఆర్టీసీ బస్సు కు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉట్నూర్ నుండి 70 మంది ప్రయాణికులతో బయలుదేరి ఆదిలాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సుపై గుడిహత్నూర్ మండలంలోని రాగాపూర్ - పూనాగూడా మధ్యలో రహదారిపై ఆకస్మికంగా రోడ్డు పక్కన ఉన్న చెట్టు విరిగి పడింది.

వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ రామ స్వామి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను సురక్షితంగా కాపాడాడు. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు ధ్వంసం కాగా, డ్రైవర్ రామ స్వామి కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు డ్రైవర్ కి ధన్యవాదాలు తెలిపారు.