సిరిసిల్ల, జనవరి 31 (విజయ క్రాంతి): ప్రమాదవశాత్తు ఆర్టిసి బస్సు పొలంలోకి దూసుకెల్లడంతో ప్రయాణికులకు గాయాలైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం గోరింటాలలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కామరెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో సిరిసిల్ల వైపు వస్తుంది.
గోరింటాల గ్రామ సమీపంలో ఉన్న వంతెన వద్ద మూలమలుపు దగ్గర కు బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో బస్సు పొలంలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఏరియా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు