స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
సిరిసిల్ల జనవరి 1 (విజయ క్రాంతి): కారును అతి వేగంగా వచ్చి ఆర్టిసి బస్సు ఢీ కొట్టిన ఘటనలో కారులో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హైదరాబాదుకు చెందిన సాంబయ్య అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజన్న దర్శ నానికి కారులో వస్తున్నాడు. కామారెడ్డి డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి అతి వేగంగా వచ్చి ముందున్న కారును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు పక్కనే ఉన్న డివైడర్ను ఢీ కొట్టి ఆగిపోయింది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు లో ఉన్న వారికి స్వల్ప గాయాలతో బయ టపడ్డారు. ఆర్టీసీ బస్సు అతివేగమే ప్రమా దానికి కారణమని, ఒకవేళ కారు పక్కనే ఉన్న డివైడర్ను ఢీ కొని ఆగి ఉండక పోతే ముందున్న కల్వర్టులో పడేదని, ఇదే జరిగి ఉంటే ప్రమాద స్థాయి ఊహించని రీతిలో ఉండేదని ప్రత్యేక సాక్షులు చెబుతున్నారు.