calender_icon.png 11 January, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు దగ్ధం

15-07-2024 10:39:45 AM

హైదరాబాద్ నుంచి ధర్మారం వెళ్తున్న ఏపీ ఆర్టీసీ బస్సు

జడ్చర్ల సమీపంలోని బురెడ్డిపల్లి క్రాసింగ్ దగ్గర డీసీఎం ఢీకొట్టిన బస్సు

అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిన బస్సు

ప్రయాణికులు దిగిన వెంటనే ఆర్టీసీ బస్సులో చెల్లరేగిన మంటలు

మహబూబ్ నగర్ : జడ్చర్ల సమీపంలోని భూరెడ్డిపల్లి నేషనల్ హైవే దగ్గర నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువనే ఉంది. స్థానికులు తెలిపిన వివరాలలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ధర్మవరపు ఏపీ02జెడ్0419 సూపర్ లగ్జరీ బస్సు వెళ్తుంది. భూరెడ్డిపల్లి క్రాసింగ్ దగ్గర డీసీఎం యూటర్న్ తీసుకోవడంతో ఒక్కసారిగా బస్సు డీసీఎం ఢీ కొట్టింది. సుమారు ఈ ఘటన దాదాపు రెండు గంటల సమయంలో జరిగింది.

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. డీసీఎం ఢీకొట్టిన సమయంలో డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. 36 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఈ బస్సులో నుంచి ప్రయాణికులు అందరూ బస్సును దిగారు. షార్ట్ సర్క్యూట్ కారణంతో వెన్నువెంటనే ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే బస్సు దగ్ధమైంది. గాయాలు అయినా15 మంది ప్రయాణికులను జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి 108 వాహనం ద్వారా వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.