calender_icon.png 21 February, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించేవాళ్లకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

19-02-2025 01:31:29 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation) హైదరాబాద్‌ నుంచి విజయవాడ(Hyderabad-Vijayawada route)కు వెళ్లే సర్వీసులకు టికెట్‌ చార్జీలపై రాయితీ(Discount on ticket charges) ప్రకటించింది. ప్రయాణికులు లహరి నాన్-ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10శాతం తగ్గింపును పొందవచ్చు. రాజధాని ఏసీ బస్సుల్లో(Rajdhani AC buses) 8 శాతం రాయితీ ఇస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ తగ్గింపు సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని యాజమాన్యం కోరింది.